వ్యూహాలు పన్నుతున్న ‘మహా’ నాయకులు

వ్యూహాలు పన్నుతున్న ‘మహా’ నాయకులు

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. బలపరీక్షపై దృష్టి పెట్టింది. బలపరీక్షే ప్రధాన ఎజెండాగా ముంబైలో శాసనసభాపక్ష సమావేశం జరుగుతోంది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు.. పార్టీ ఎమ్మెల్యేలంతా సమావేశానికి హాజరయ్యారు. బలపరీక్షపై రేపు సుప్రీంకోర్టు ఏమైనా ఆదేశాలిస్తే.. ఎలా వ్యవహరించాలన్నదానిపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారు ఫడ్నవీస్.

శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి కూడా బలపరీక్షకు రెడీ అవుతోంది. దీనికోసం NCP ఎమ్మెల్యేలను కలిశారు శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే.  కుమారుడు ఆదిత్య థాకరేతో కలిసి.. ముంబైలోని ఓ హోటల్ లో క్యాంప్ పెట్టిన ఎమ్మెల్యేలను దగ్గరకు వెళ్లారు. వారితో మాట్లాడారు. ఒకవేళ బీజేపీ ప్రలోభాలకు గురిచేసినా.. ఎమ్మెల్యేలు చేజారి పోకుండా ఉండేలా వారితో మాట్లాడుతున్నారు.

ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌ కూడా పార్టీ ఎమ్మెల్యేలతో తాజా పరిణామాలపై నేతలతో చర్చించారు. అజిత్‌ పవార్‌ను వెనక్కి రప్పించేందుకు వ్యూహం పన్నుతున్నారు. అజిత్‌తో చర్చలకు శరద్‌పవార్‌ పార్టీ ఎమ్మెల్యేను పంపారు.