గిర్నా నదిలోకి దూకిన యువకుడు

గిర్నా నదిలోకి దూకిన యువకుడు

మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.  కానీ ఓ యువకుడు మాత్రం మాలేగావ్ లో ఉధృతంగా ప్రవహిస్తున్న గిర్నా నదిలోకి డైవ్ చేశాడు. బ్రిడ్జిపై నుంచి అమాంతం నదిలోకి దూకేశాడు. దీంతో అక్కడున్న వారంతంగా ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. నదిలోకి డైవ్ చేసిన వెంటనే అతడు ఎంతకీ పైకి రాలేదు. ఈ విషయం అధికారులకు తెలియజేయడంతో అతడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. అయినా యువకుడి జాడ కనిపించలేదు. యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నదిలోకి యువకుడు ఎందుకు జంప్  చేశాడు? ఆత్మహత్య చేసుకోవడానికే నదిలోకి డైవ్ చేశాడా? లేక సరదాగా ఈత కొట్టేందుకే నదిలోకి దూకాడా అనేది తెలియాల్సి ఉంది. పరవళ్లు తొక్కుతున్న గిర్నా నదిలోకి ధైర్యంగా యువకుడు డైవ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహారాష్ట్రలో గత వారం రోజులుగా పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుణె,నాసిక్ తో పాటు మరో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణశాఖ అధికారులు.