అనిల్ అంబానీకి ఇచ్చిన 5 ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లు వెనక్కి!

అనిల్ అంబానీకి ఇచ్చిన  5 ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లు వెనక్కి!

ముంబై: అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకు లీజుకు ఇచ్చిన ఐదు ఎయిర్‌‌‌‌పోర్టులను తిరిగి తీసుకుంటామని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.  ప్రస్తుతం ఆ రాష్ట్రంలోని లాతూర్‌‌‌‌, ఉస్మానాబాద్‌‌, నాందేడ్‌‌, యావత్మల్‌‌, బారామతి ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లను డెవలప్‌‌ చేయడానికి  అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్‌‌ ఎయిర్‌‌‌‌పోర్ట్స్ డెవలప్‌‌మెంట్‌‌ లిమిటెడ్ 30 ఏళ్లకు గాను  2009 లో లీజుకు తీసుకుంది. 

ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ల డెవలప్‌‌మెంట్‌‌లో ఎటువంటి ప్రోగ్రెస్ లేకపోవడంతో  వీటిని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ వెనక్కి తీసుకుంటుందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌‌ అన్నారు. కాంగ్రెస్‌‌–ఎన్‌‌సీబీ ప్రభుత్వం ఈ ఐదు ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లను అనిల్ అంబానీకి లీజుకి ఇచ్చింది.