ముంబై మాజీ ACP.. బిల్డింగ్ పైనుంచి దూకేశాడు

ముంబై మాజీ ACP.. బిల్డింగ్ పైనుంచి దూకేశాడు

రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) ప్రదీప్ టెంకర్ (70) ఆత్మహత్య చేసుకున్నారు. మహారాష్ట్రలోని ముంబయిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన తన ఇంట్లోనే ఈ దారుణానికి పాల్పడ్డారు. ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. టెంకర్ ను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 

అయితే డాక్టర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయనను రక్షించలేకపోయారు. గాయాలు తీవ్రంగా ఉండటంతో ప్రాణాంతకంగా మారి టెంకర్ చనిపోయారని డాక్టర్లు ప్రకటించారు. ఈ ఆత్మహత్యపై వెంటనే స్పందించిన ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. మాతుంగా పోలీస్ స్టేషన్ లో ఏడీఆర్ కింద కేసు నమోదు చేశారు.

ALSO READ:  అపార్ట్ మెంట్ మంటల్లో చనిపోయిన ఐపీఎల్ మాజీ క్రికెటర్ సోదరి ఫ్యామిలీ

 టెంకర్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారన్న విషయం ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. పోలీసులు ఉన్నతాధికారిగా సేవలు అందించిన ఆయన మరణం స్థానికంగా విషాదాన్ని రేకెత్తించింది. ఈ ఘటనపై పోలీసులు ఉన్నతాధికారులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.