మహారాష్ట్రలో ఘోరం: కల్తీ మద్యం తాగి 13 మంది మృతి...!

మహారాష్ట్రలో ఘోరం: కల్తీ మద్యం తాగి 13 మంది మృతి...!

మహారాష్ట్రలో ఘోరం జరిగింది.కల్తీ మద్యం తాగి 13 మందిన ఘటన కలకలం రేపింది. మహారాష్ట్రలోని పూణే, పింప్రి చించ్వాడ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. పింప్రి చించ్వాడ్ లో కల్తీ మద్యం తాగి 24 గంటల్లో ఎనిమిది మంది మృతి చెందగా.. తీవ్ర అస్వస్థతకు గురైన మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.పూణేలో మరో ఐదుగు మృతి చెందినట్లు తెలుస్తోంది.

కల్తీ మద్యం కారణంగానే ఈ మరణాలు సంభవించి ఉండచ్చని భావిస్తున్నప్పటికీ ఫోరెన్సిక్, పోస్టుమార్టం నివేదికలు ఆడిన తర్వాతనే కచ్చితమైన కారణం తెలుస్తుందని తెలిపారు పోలీసులు. బాధితుల్లో కనిపించిన లక్షణాలను బట్టి కల్తీ మద్యం కారణంగానే మరణాలు సంభవించి ఉండచ్చని భావిస్తున్నట్లు తెలిపారు అధికారులు. బాధితుల్లో చాలామంది తల తిరగడం, నోటి నుండి నురుగు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, పల్స్ రేట్ పడిపోవడం వంటి లక్షణాలు కనిపించాయని తెలిపారు.

ఈ క్రమంలో పూణే వ్యాప్తంగా మద్యం తయారీ, పంపిణీకి సంబంధించిన నెట్వర్క్ పై ఆరా తీస్తున్నారు పోలీసులు. కల్తీ మద్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న యోగేష్ వాంఖడేపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరణించినవారిలో నలుగురికి మద్యం అలవాటు లేదని.. ఒకరికి మాత్రమే మద్యం అలవాటు ఉందని ప్రాథమిక విచారణలో  తేలిందని తెలిపారు పోలీసులు.