ఎల్లుండి నుంచి మాస్క్ ఫ్రీ రాష్ట్రంగా మహారాష్ట్ర

ఎల్లుండి నుంచి మాస్క్ ఫ్రీ రాష్ట్రంగా మహారాష్ట్ర

ముంబై : కరోనా కల్లోలంతో తీవ్రంగా ప్రభావితమైన మహారాష్ట్రలో ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. రోజువారీ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. దీంతో దాదాపు రెండేళ్ల తర్వాత కరోనా నిబంధనలకు గుడ్ బై చెప్పనున్నారు. శనివారం మరాఠీ కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని కొవిడ్ నిబంధనలన్నింటినీ ఎత్తివేయనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ జరిగిన కేబినెట్ మీటింగ్ లోఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం ఉద్దవ్ థాక్రే చెప్పారు. ఎల్లుండి నుంచి మాస్కులు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. అయితే ప్రజలు మాస్క్ లు ఉపయోగించాలని సూచించింది. 

మహారాష్ట్రలో ప్రస్తుతం రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య 100లోపు నమోదవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 35 జిల్లాల్లో 964 యాక్టివ్ కేసులున్నాయి. 2020లో కొవిడ్ ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్రంలో 78,73,619 కేసులు నమోదుకాగా.. 1,47,780 మంది చనిపోయారని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.