లోక్‌స‌భ‌లో కూడా మహిళలకు సీట్లు అంతంతమాత్రమే

లోక్‌స‌భ‌లో కూడా మహిళలకు సీట్లు అంతంతమాత్రమే
  • మహారాష్ట్రలోనూ మహిళలకు దక్కని ప్రాధాన్యం
  • ప్రధాన పార్టీల తరఫున బరిలో 13 మంది మాత్రమే

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకుండా లోపాయికారి అవగాహనతో నీరుగార్చు తూ వస్తున్న రాజకీయ పార్టీలు టిక్కెట్లపంపి ణీలో కూడా ఈ విధానాన్నే అనుసరిస్తున్నాయి. మహారాష్ట్రలో  మొత్తం 48 లోక్ సభ స్థానాలుంటే ప్రధాన పార్టీలైన బీజేపీ, శివసేన,కాంగ్రెస్, ఎన్సీపీలు కలిపి కేవలం 13 మంది మహిళలకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చాయి.  మొత్తం ఓట్లలో 50 శాతం ఉన్న మహిళల ఓట్లకు గాలం వేస్తున్న పార్టీలు టిక్కెట్ల పంపిణీలో మాత్రం మొహం చాటేస్తున్నాయి. ‘బేటీ బచావో బేటీపడావో’ నినాదం ఇచ్చిన బీజేపీ కూడా కేవలం ఏడుగురికి మాత్రమే టిక్కెట్లు కేటాయించింది. మిగతా పార్టీలతో పోల్చితే బీజేపీ కాసిన్ని సీట్లు ఎక్కువే కేటాయించినా, వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన పూనమ్ మహాజన్, ప్రీతమ్ ముండే కూడా ఈ జాబితాలో ఉన్నారు.

కాంగ్రెస్ తరపున ముగ్గురు, శివసేన, ఎన్సీపీ తరపున తలా ఒకరికి టిక్కెట్ ఇచ్చారు. కాంగ్రెస్‌‌ తరఫున ఫిల్మ్‌‌స్టార్‌‌ ఊర్మిళ, ఎన్సీపీ తరఫున శరద్‌‌ పవార్‌‌ కూతురు  సుప్రియ పోటీలో ఉన్నారు. మరీ ఇంత తక్కు వ సంఖ్యలో సీట్లు కేటాయించడంపై పార్టీలకు అతీతంగా మహిళా నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ లోకసభ ఎన్నికల్లో 41 శాతం సీట్లు మహిళలకు కేటాయించారని గుర్తు చేస్తున్నారు.మొత్తం  42 స్థా నాల్లో 17 మంది మహిళలను బరిలోకి దించారని చెబుతున్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లోక్ సభ సీట్లలో 33 శాతం మహిళలకు కేటాయించారని గుర్తుచేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలే ఈ మేరకు చొరవ చూపిస్తున్నప్పుడు జాతీయ పార్టీలు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నిస్తున్నారు.