వైరల్ వీడియో.. కోతి దాహం తీర్చిన కానిస్టేబుల్..

వైరల్ వీడియో.. కోతి దాహం తీర్చిన కానిస్టేబుల్..

దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతున్నాయి. ఎండల ధాటికి మనుషులే కాదు.. జంతువులు అల్లాడిపోతున్నాయి. మహారాష్ట్రలో దాహంతో ఉన్న కోతికి ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ మంచినీళ్లు తాగించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నంద ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు సంజయ్ ఘుడే చేసిన పనికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. 


మహారాష్ట్రకు చెందిన సంజయ్ ఘుడే మల్షేజ్ ఘాట్ ప్రాంతంలో రెండేళ్లుగా ట్రాఫిక్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. మల్షేజ్ ఘాట్ పరిసరాల్లో ఎండాకాలంలో కోతులు, కుక్కలు, పిల్లులతో పాటు వివిధ రకాల జంతువులు నీరు దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ఈ విషయాన్ని గ్రహించిన సంజయ్ ఘుడే వాటి దాహార్తిని తీర్చాలని నిర్ణయించుకున్నారు. రోజూ తన వెంట వాటర్ బాటిళ్లు తీసుకెళ్లి వాటి దప్పిక తీర్చడం మొదలుపెట్టాడు. ఆయనను చూసి మరికొందరు పోలీసులు సైతం మూగజీవాల దూప  తీరుస్తున్నారు.