మహారాష్ట్ర: థానే రైల్వే స్టేషన్ లోని వన్ రూపీ క్లినిక్ లో గురువారం ఓ గర్భిణీ మగ శిశువుకు జన్మనిచ్చింది. సుభంతి పత్రా అనే మహిళ తన భర్తతో కలసి గురువారం ఉదయం లోకల్ ట్రైన్ కర్జాత్ నుండి పరేల్ వెళుతుండగా మార్గ మధ్యంలో ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. ట్రైన్ థానే రైల్వే స్టేషన్ చేరుకోగానే తోటి ప్రయాణికులు వారిని వెంటనే ఆ స్టేషన్ లో దిగాలని సూచించారు. ఆమె నొప్పులతో బాధపడుతున్న విషయం గ్రహించిన రైల్వే పోలీసులు వెంటనే అప్రమత్తమై ప్లాట్ ఫామ్ కు చేరుకొని ఆమెను స్టేషన్ లోని వన్ రూపీ క్లినిక్ కు తరలించారు.
ఆమెకు నార్మల్ డెలివరీ అయిందని, తల్లీ బిడ్డల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఒక రూపాయి క్లినిక్ ఇన్‌ఛార్జి డాక్టర్ రాహుల్ ఘులే తెలిపారు. మెరుగైన చికిత్స కోసం వారిని దగ్గర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ఎమర్జెన్సీ టైమ్ లో వన్ రూపీ క్లినిక్ యొక్క ఆవశ్యకత ఎంటో నేడు నిరూపించిందని, ఈ క్లినిక్ ను రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసినందుకు ఇచ్చినందుకు రైల్వే అధికారులకు కృతజ్ఞతలు అని ఘులే చెప్పారు.
సెంట్రల్ రైల్వే (సిఆర్) సహకారంతో మ్యాజిక్‌డిల్ అనే సంస్థ ఈ 1 రూపాయి క్లినిక్ ను నిర్వహిస్తోంది. 2017 లో థానే స్టేషన్‌లో ప్రారంభించబడిన ఈ క్లినిక్ రోగులకు 1 రూపాయి తక్కువ ఛార్జీతో వైద్య సేవలు అందిస్తోంది. రోజులో 24 గంటలూ తెరిచి ఉండే ఈ క్లినిక్ లో మూడు షిఫ్టులపాటు వైద్యులు రోగులకు చికిత్సనందిస్తారు.

