మహేష్ బాబు ‘మహర్షి’ మరో రికార్డు

మహేష్ బాబు ‘మహర్షి’ మరో రికార్డు

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘మహర్షి’. దిల్ రాజు, సి. అశ్వనిదత్, ప్రసాద్ వీ. పొట్లూరి నిర్మాతలుగా వ్యవహరించారు. మే 9, 2019న విడుదలయైన ఈ సినిమా రూ. 130 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి.. బాక్సాఫీస్ వద్ద 170 కోట్ల రూపాయలను వసూల్ చేసింది. దీన్ని బట్టే అర్థంచేసుకోవచ్చు ప్రేక్షకులు ఈ సినిమాను ఎంతగా ఆదరించారో.

తాజాగా ట్విట్టర్ ‘మోస్ట్ ఇన్‌ఫ్లుయన్షల్ మూమెంట్స్ ఆన్ ట్విట్టర్’లో చోటు సంపాదించుకున్న ఐదు ప్రోగ్రామ్‌లను ప్రకటించింది. వీటిలో విశ్వాసం మొదటిస్థానంలో ఉండగా, లోకసభ ఎలక్షన్స్ 2019 మరియు సీడబ్ల్యూసీ 19 వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. ఆ తరువాత మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా నాలుగో స్థానంలో నిలిచింది. తదుపరి ఐదో స్థానంలో హిందువుల పండగ దీపావళి చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గర్వంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం మహేష్ బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తున్నారు.

మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ను ఫాలో అవ్వండి