
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు ఆయా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర అధికారులు, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు గాంధీజీ విగ్రహాలకు, ఫొటోలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పలువురు మాట్లాడుతూ శాంతి, అహింసా మార్గాలతో గాంధీజీ దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టారని, ప్రతి ఒక్కరూ ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు.
ALSO READ : సీఎం కేసీఆర్‌ది శాడిస్ట్ పాలన: కూనంనేని సాంబశివరావు
కాగా ఆదిలాబాద్ బస్టాండులో గాంధీజీ వేషధారణలో ఆర్టీసీ ఉద్యోగి నిరంజన్ ప్రయాణికులను ఆకట్టుకుంటూ బస్సులో ప్రయాణించడం సురక్షితమని వారికి అవగాహన కల్పించారు.