ప్రతి ఎంపీ 150 కిలోమీటర్ల పాదయాత్ర: కిషన్ రెడ్డి

ప్రతి ఎంపీ 150 కిలోమీటర్ల పాదయాత్ర: కిషన్ రెడ్డి
  • ప్లాస్టిక్ రహిత సమాజం, పర్యావరణ పరిరక్షణే యాత్ర లక్ష్యం

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజల్లోకి మహాత్మ గాంధీ ఆయాలను తీసుకెళ్లాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ప్రతి ఎంపీ 150 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారని ఆయన అన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్లాస్టిక్ రహిత సమాజం, పర్యావరణ పరిరక్షణ ఈ యాత్ర లక్ష్యాలని చెప్పారాయన.

మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఖైరతాబాద్ లో మహాత్మాగాంధీ మహా సంకల్ప యాత్ర.ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డితో పాటు పలువురు బిజెపి నేతలు పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి కూడా గాంధీజీ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోందని కిషన్ రెడ్డి చెప్పారు. గాంధీజీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతీ నాయకుడు పని చేయాలని అన్నారు. అహింస,  స్వచ్ఛభారతం, పర్యావరణ పరిరక్షణ, అవినీతి రహిత పాలన మహాత్ముడి ఆశయాలన్నారు. ఈ ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, నవభారత్ నిర్మాణం చేయాలని కిషన్ పిలుపునిచ్చారు.