కెనడాలో గాంధీ విగ్రహానికి అవమానం

కెనడాలో గాంధీ విగ్రహానికి అవమానం

కెనడాలోని Ontarioలోని రిచ్ మండ్ హిల్ నగరంలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనిపై హై కమిషన్ ఆఫ్ ఇండియా తీవ్రంగా స్పందించింది. విగ్రహం ధ్వంసంపై సీరియస్ అయ్యింది. ఈ మేరకు భారత హై కమిషన్ ట్వీట్ చేసింది. భారత సమాజాన్ని భయబ్రాంతులకు గురి చేసే ధ్వేషపూరిత నేరానికి పాల్పడడం ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. భారతీయ కమ్యూనిటీలో అభద్రతాభావానికి దారి తీసిందని వ్యాఖ్యానించింది. కెనడియన్ ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు, ధ్వంసానికి పాల్పడిన వారిని శిక్షించాలని కెనడా ప్రభుత్వానికి సూచించింది. 

గాంధీ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారని, అవమానకరమైన పదాలు ఉపయోగించారని కెనడా పోలీసులు వెల్లడించారు. ఇలాంటి చర్యలను తాము సహించబోమని కానిస్టేబుల్ Amy Boudreau తెలిపారు. ధ్వేష పూరిత ఘటలను తాము తీవ్రంగా పరిగణిస్తామన్నారు. ఘటన జరగడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు Kanchan Gupta తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కెనడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారన్నారు.