గాంధీ మునిమనవరాలుకి ఏడేళ్ల జైలుశిక్ష

గాంధీ మునిమనవరాలుకి ఏడేళ్ల జైలుశిక్ష

ఫోర్జరీ కేసులో మహాత్మగాంధీ మునిమనవరాలు ఆశిష్ లతా రామ్‌గోబిన్ కు జైలుశిక్ష పడింది.  ఓ వ్యాపారవేత్తను మోసం చేసిన కేసులో ఆశిష్ లతా రామ్‌గోబిన్ కు  ఏడేళ్ల జైలుశిక్ష విధించింది దక్షిణాఫ్రికాలోని డర్బన్ కోర్టు.  వ్యాపారవేత్త మహరాజన్ ను రూ.3.23కోట్ల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలలో ఆమె దోషిగా తేలింది. ఇండియా నుంచి వచ్చే ఓ కన్సైన్ మెంట్ కోసం ఇంపోర్ట్ కస్టమ్స్ డ్యూటీస్ చెల్లించేందుకు వ్యాపారవేత్త మహారాజ్ ఆశిష్ లతా రామ్‌గోబిన్ కు అడ్వాన్స్ గా రూ.3.23కోట్లు(6.6 లక్షల ర్యాండ్లు) చెల్లించాడు. ఇందుకుగానూ ఆయనకు లాభాల్లో వాటా వస్తుంది.  అయితే ఆమెకు కన్ సైన్ మెంటే లేదని ..నకిలీ బిల్లులు సృష్టించి ఆయనను మోసం చేసినట్లు రుజువైంది. 2015 నుంచి కొనసాగుతున్నఈ కేసులో సోమవారం తుది తీర్పునిచ్చింది కోర్టు. ప్రముఖ హక్కుల పోరాట యోధురాలు ఎలియా గాంధీ, దివంగత మేవా రామ్‌గోబింద్‌ల కూతురే ఆశిష్ లతా రాంగోబిన్.