బంగారు పేటలోన..

బంగారు పేటలోన..

డాక్టర్, డాన్‌‌, ప్రిన్స్‌‌ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శివ కార్తికేయన్.. త్వరలో ‘మహావీరుడు’ చిత్రంతో రాబోతున్నాడు. మడోన్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. శంకర్ కూతురు అదితి హీరోయిన్‌‌గా నటిస్తోంది. ఈ మూవీ నుండి ‘బంగారు పేటలోన ఒక ఏకాకి కాకి ఉంది’ అంటూ సాగే పాటను బుధవారం విడుదల చేశారు.

భరత్ శంకర్ కంపోజ్ చేయడంతో పాటు హీరోయిన్‌ అదితి‌‌తో కలిసి పాడాడు. పాటలో హీరోహీరోయిన్స్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. తమిళంలో ‘మా వీరన్‌‌’ పేరుతో అరుణ్‌‌ విశ్వ నిర్మిస్తున్నారు. యోగి బాబు, సునీల్, మిస్కిన్, సరిత ఇతర పాత్రలు పోషిస్తున్నారు. జులై 14న విడుదల కానుంది. ఏషియన్ సినిమాస్ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది.