
తెలుగులో తన కంటూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ సెట్ చేసుకున్న యాక్టర్ శివ కార్తికేయన్(Sivakarthikeyan). రీసెంట్ గా డైరెక్టర్ అనుదీప్ తో చేసిన ప్రిన్స్ మూవీ అభిమానులను హుషారయ్యేలా చేశారు. ఇప్పుడు డైరెక్టర్ అశ్విన్(Ashwin) మహా వీరుడు కథను చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారని సమాచారం. తాజాగా మహావీరుడు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివ కార్తికేయన్ తన తెలుగు స్పీచ్ తో అందరినీ ఆకట్టుకున్నారు.
"అందరికీ నమస్కారం. ముఖ్య అతిధిగా వచ్చిన శేఖర్ కమ్ముల సర్, అనుదీప్, అడివి శేష్ బ్రదర్ కి థ్యాంక్స్ అని తెలిపారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల సర్ తీసిన హ్యాపీడేస్, ఫిదా సినిమాలు తను బాగా ఎంజాయ్ చేశానని.. ఈవెంట్ కు మీరు వచ్చినందుకు చాలా థాంక్స్ అని అన్నారు.
అడివి శేష్ ని చూస్తే నా బ్రదర్ ఫీలింగ్ వస్తోంది. బ్రదర్ మీరు స్క్రిప్ట్ రెడీ చేసుకుని రండి కలిసి చేద్దామని అన్నారు. గూఢచారి 2 కోసం సిన్సియర్ గా వెయిట్ చేస్తున్నానని అన్నారు శివ కార్తికేయన్. ఇక అనుదీప్ పేరు ఎత్తగానే ఆడిటోరియం అదిరిపోయింది. అనుదీప్ సిగ్నేచర్ ఈయ.. అని తనకి థ్యాంక్స్ చెప్పారు శివ కార్తికేయన్.
మహావీరుడు ఇది ఒక ఫాంటసీ ఫిలిమ్. డైరెక్టర్ అశ్విన్ బ్రిలియంట్ గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు వివరిస్తూ..యాక్టర్ సునీల్ తో మరోసారి నటించాలని ఉందని తెలిపాడు. మహావీరుడు మూవీ హీరోయిన్ అదితి గురించి మాట్లాడుతూ.. తను మల్టీ టాలెంటెడ్.. యాక్టర్ సింగర్ డ్యాన్సర్.. ఈ సినిమాలో చాలా మెచ్యుర్డ్ గా పర్ఫార్మ్ చేశారని అన్నారు.
ఈ సినిమాతో అదితి తెలుగు ఎంట్రీ ఇస్తుందని మహావీరుడు కూడా మిమ్మల్ని ఆదరిస్తుందని ఫ్యాన్స్ కు కిక్కిస్తూ నీ యవ్వా తగ్గేదేలే..అంటూ తెలుగులో స్పీచ్ అదరగొట్టారు శివకార్తీకేయన్.
డైరెక్టర్ అశ్విన్ గతంలో యోగిబాబుతో తీసిన మండేలా మూవీ విమర్శకుల ప్రశంశలు అందుకున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో జూలై 14న రిలీజ్ కానుంది. శాంతి టాకీస్ బ్యానర్ పై అరుణ్ విశ్వ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.