మహబూబ్ నగర్ అంటే ఒకప్పుడు మైగ్రేషన్.. ఇప్పుడు ఇరిగేషన్

మహబూబ్ నగర్ అంటే ఒకప్పుడు మైగ్రేషన్.. ఇప్పుడు ఇరిగేషన్


ఒకప్పుడు నెర్రెలు వారిన పాలమూరు నేల ఇప్పుడు పంటలతో కళకళలాడుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్ నగర్ అంటే ఒకప్పుడు మైగ్రేషన్ అని ఇప్పుడు ఇరిగేషన్ గా మారిందన్నారు. పాలమూరు లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు...

కాంగ్రెస్ కి ఒక్క అవకాశం ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటున్నారని, 55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న ప్రధాని మోడీ, బీజేపీ కి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. సొంత జాగాలో ఇళ్లు కట్టుకునే వారి కోసం రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని త్వరలో అందిచనున్నట్లు వెల్లడించారు.