రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభం : అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్

రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభం : అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 31 వరకు నిర్వహించనున్న 17వ రోడ్డు భద్రతా మాసోత్సవాలను అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ గురువారం కలెక్టరేట్​లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీట్​బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. 

అనంతరం రోడ్డు భద్రతపై నినాదాలకు సంబంధించి పోస్టర్​ రిలీజ్ చేశారు. సిబ్బందికి హెల్మెట్లు అందజేశారు. ఆర్టీవో రఘు, ఎంవీఐ వాసుదేవరావు, ఏఎంవీఐ రుబీనా పర్వీన్ తదితరులు పాల్గొన్నారు.