Mahesh Babu: టీనేజీలోకి అడుగుపెట్టిన సితార.. విషెస్‌ చెబుతూ ఫోటో షేర్ చేసిన మహేష్, నమ్రత

Mahesh Babu: టీనేజీలోకి అడుగుపెట్టిన సితార.. విషెస్‌ చెబుతూ ఫోటో షేర్ చేసిన మహేష్, నమ్రత

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కూతురు సితార (Sitara)ఘట్టమనేని పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో క్యూట్ పిక్స్, వీడియోస్తో తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ను ఏర్పరుచుకుంది. యాక్టింగ్, సింగింగ్, పెయింటింగ్, డ్యాన్సింగ్తో ఇప్పటికే తన టాలెంట్ను నిరూపించుకుంది. చిన్న వయసులోనే మల్టీటాలెంటెడ్‌గా పేరు తెచ్చుకున్న సితార.. నేటితో (జూలై 20) 13వ వసంతంలోకి అడగుపెట్టింది.

ఈ సందర్భంగా తండ్రి మహేష్ బాబు, తల్లి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా ద్వారా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సితార టీనేజీలోకి అడుగుపెట్టిందని చెబుతూ మహేష్ బాబు ఆనందం వ్యక్తం చేశారు. ఆమెతో కలిసి దిగిన ఫొటోను Xవేదికగా అభిమానులతో పంచుకున్నారు.

'సితార ఎల్లప్పుడూ నా జీవితాన్ని వెలిగిస్తుంది.  నిన్ను చాలా ప్రేమిస్తున్నాను' అని మహేష్ తన ప్రేమను వ్యక్తపరిచాడు. 'నా చేతిని పట్టుకుని నా ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చిన చేయి నీదే అవుతుంది..  పుట్టినరోజు శుభాకాంక్షలు సితార.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను' అని నమ్రత కూతురు సితారాతో దిగిన ఫోటోలు షేర్ చేసింది.

ఇక సితార విషయానికి వస్తే.. ఇప్పటికే ఆమె తన డాన్స్ వీడియోస్ తో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. తండ్రి మహేష్ బాబుతో కలిసి పలు టీవీ షోలకు కూడా అటెండ్ అయ్యారు. సితార ప్రస్తుతం ప్రముఖ బంగారు నగల తయారీ సంస్థ పిఎంజె జివెల్స్(Pmj jewellers) కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఈ సంస్థ సితార కలెక్షన్ పేరుతో ప్రత్యేకంగా ఓ స్పెషల్ బ్రాండ్ ను కూడా క్రియేట్ చేసింది. దీనికి సంబంధించిన యాడ్ ను న్యూ యార్క్ సిటీలోని టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించడం విశేషం.