వెక్కివెక్కి ఏడ్చిన సితార.. ఓదార్చిన మహేష్

వెక్కివెక్కి ఏడ్చిన సితార..  ఓదార్చిన మహేష్

తన నాయనమ్మ ఇందిరాదేవి మరణవార్త తట్టుకోలేక  మహేష్  బాబు కూతురు సితార వెక్కివెక్కి ఏడ్చింది. ఇందిరాదేవి  భౌతికకాయం వద్ద కూర్చొని నాయనమ్మను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది. మహేష్ ఆమెను ఎంత ఓదార్చినా దు:ఖం  ఆపుకోలేకపోయింది. నాయనమ్మ అంటే సితారకు ఎంతో ప్రేమని, తరచూ ఇందిరాదేవిని చూసేందుకు వెళ్లేదని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.   

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరాదేవి ఇవాళ తన  నివాసంలోనే తుదిశ్వాస విడిచారు.  సూపర్ స్టార్ కృష్ణకు ఇందిరా దేవి  మొదటి భార్య. వీరికి ఇద్దరు కొడుకులు రమేష్ బాబు,  మహేశ్ బాబు, కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు.  కృష్ణ రెండో భార్య విజయ నిర్మల 2019లో చనిపోయారు. కృష్ణ పెద్ద కొడుకు రమేశ్ బాబు  ఈ ఏడాది జనవరిలో మృతి చెందాడు. ఇందిరాదేవి అంత్యక్రియలు ఈ రోజు మహాప్రస్థానంలో జరగనున్నాయి.