
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో వస్తోన్న చిత్రం గుంటూరు కారం. రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన రెండు పాటలు ఆడియన్స్ ని అలరిస్తున్నాయి. ఫస్ట్ సింగిల్ దమ్ మసాలా బిర్యానీ, సెకండ్ సింగిల్ (Oh My Baby) ఓ మై బేబీతో ఆడియన్స్ కి ఘాటు,రొమాంటిక్ చూపించారు మేకర్స్.
లేటెస్ట్గా ఇవాళ క్రిస్మస్ (Christmas) స్పెషల్గా మహేష్ బాబు పోస్టర్ రిలీజ్ చేశారు. క్లాస్ లుక్లో కనిపిస్తోన్న మహేష్ బాబు స్టీల్కి ప్రేక్షకులు ఫిదా ఆవుతోన్నారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో టాప్ ట్రేండింగ్తో దూసుకెళ్తోంది. అతడు, ఖలేజా వంటి మూవీస్ తర్వాత మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా గుంటూరు కారం తెరకెక్కుతోంది. ఈ మూవీ మదర్ సెంటిమెంట్ తో పాటు యాక్షన్ ఎంటర్ టైనర్ గా త్రివిక్రమ్ రూపొందిస్తోన్నారు.
దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో హారిక హాసిని క్రియేషన్స్ (Harika hasini creations) పై చినబాబు (Chinababu), సూర్యదేవర నాగవంశీ (Suryadevara nagavanshi) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో..బ్యూటీ శ్రీలీల(Sreeleela), మీనాక్షి చౌదరి (Meenakshi chaudary) హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.
Wishing you all a Merry Christmas filled with joy and warmth! ??❄️ - Team #GunturKaaram ?
— Guntur Kaaram (@GunturKaaram) December 25, 2023
Super? @urstrulyMahesh #Trivikram @MusicThaman @sreeleela14 @meenakshiioffl @vamsi84 @manojdft @NavinNooli #ASPrakash @haarikahassine @adityamusic #GunturKaaramOnJan12th ? pic.twitter.com/0OebdLaoB3