అశోక్ గల్లా కొత్త సినిమా.. ఇలాంటి టీజర్ ఊహించి ఉండరు

అశోక్ గల్లా కొత్త సినిమా.. ఇలాంటి టీజర్ ఊహించి ఉండరు

మహేశ్ బాబు మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు అశోక్ గల్లా. తొలి సినిమా ‘హీరో’ వంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తీసి పరవాలేదనిపించాడు. కమర్షియల్ గా చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకోలేకపోయినా మరోసారి లక్ పరీక్షించుకోవడానికి రెడీ అయ్యాడు. తాజాగా అశోక్ రెండో సినిమా టీజర్ ను మహేశ్ బాబు చేతుల మీదుగా విడుదల చేయించారు. తన మేనల్లుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మహేశ్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. 

 ఊహించని విధంగా అశోక్ రెండో సినిమాతోనే యాక్షన్ బాట పట్టినట్టుగా కనిపిస్తున్నాడు.  కోర మీసం  మెలేస్తూ మంచి యాక్షన్ సీన్ తో టీజర్ ను వదిలాడు. డిఫరెంట్ లుక్ తో సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు. హీరో కొత్తవాడే అయినా సినిమాకు పని చేస్తున్న వారంతా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నవారు. ఇటీవల మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న హనుమాన్ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ దీనికి కథను అందించాడు. డైలాగుల బాధ్యత బుర్రా సాయిమాధవ్ చూసుకుంటున్నాడు. గుణ 369 తెరకెక్కించిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు త్వరలోనే టైటిల్ ఖరారు చేయనున్నారు. తొలి సినిమాలో నిధి అగర్వాల్ తో జోడీ కట్టిన అశోక్ రెండో సినిమాలో నటించే హీరోయిన్ ను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. 

https://youtu.be/OkzYQkbZwHg