రాజమౌళి ప్రాజెక్ట్ కోసం మహేష్ తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా!

రాజమౌళి ప్రాజెక్ట్ కోసం మహేష్ తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా!

ప్రస్తుతం ఇండియా నుండి వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ హైపుడ్ మూవీ ఏదైనా ఉందంటే అది మహేష్(Mahesh babu), రాజమౌళి(Rajamoulli) కాంబోలో వస్తున్న మూవీ(SSMB29) అని చెప్పాలి.

ఆర్ఆర్ఆర్(RRR) వంటి గ్లోబల్ హిట్ తరువాత దర్శకదీరుడు రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ఈ ప్రాజెక్టు గురుంచి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా నేషనల్ వైడ్ ట్రేండింగ్ గా మారుతోంది. లేటెస్ట్ గా మహేష్ బాబు ఈ సినిమాకు గానూ..రికార్డు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. 

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు ఏకంగా రూ.110 కోట్లు రెమ్యునరేషన్ గా అందుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోస్ లో మహేష్ బాబు ఒకరు.ప్రొడ్యూసర్స్ కూడా మహేష్ అడిగినంత ఇవ్వడానికి ఎప్పుడు వెనుకాడరు. 

మహేష్ బాబు పోకిరి సినిమా నుంచి..తన రెమ్యునరేషన్ ను పెంచుకుంటూ వస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల 2016లో తెరకెక్కించిన బ్రహ్మోత్సవం మూవీకి గాను రూ.22 కోట్లు తీసుకోగా..అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమాకు రూ.40 కోట్లు, సర్కారువారి పాట కోసం రూ.50 కోట్లు తీసుకున్నారు.

Also Read :- నేషనల్ అవార్డ్ కు రెడీ అయిన అల్లు 

ప్రస్తుతం త్రివిక్రమ్ గుంటూరు కారం మూవీకు రూ.78 కోట్లు రెమ్యునరేషన్ ను తీసుకునే స్థాయికి మహేష్ బాబు ఎదిగాడు. ఇప్పుడు రాజమౌళి తో రాబోయే ఎస్ఎస్ఎంబీ29 కోసం రూ.100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటుండంతో..టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయాడు మహేష్ బాబు. 

టాలీవుడ్ సినీ చరిత్రలో అపజయం లేని డైరెక్టర్ గా చెరగని ముద్ర వేశారు దర్శక ధీరుడు రాజమౌళి. టాలీవుడ్ లో కలల రాజకుమారుడిగా..మోస్ట్ స్టైలిష్ హీరోగా మహేష్ బాబు తనదైన మూవీస్ తో ఇండుస్ట్రీలో సత్తా చాటుతున్నారు.ఇక వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ వస్తోందని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి..ఫ్యాన్స్ అప్డేట్స్ విషయంలో ఆగలేకపోతున్నారు. 

ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. రాజమౌళి తండ్రి విజేయేంద్ర ప్రసాద్‌ కనీవినీ ఎరుగని రీతిలో కథను సిద్ధం చేశారట. ఫైనల్ స్క్రిప్ట్ కూడా లాక్ చేశారని సమాచారం. హై-వోల్టేజ్ యాక్షన్‌ అండ్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు నవంబర్‌లో ప్రారంభం కానుండగా.. వచ్చే ఏడాది జూన్ ఆగస్టు నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.