
సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh babu) ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో 'గుంటూరు కారం(Gunturu kaaram)' మూవీ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షెర వేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, గుంటూరు కారం చిత్రం యూనిట్ BHEL హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్‌ను స్టార్ట్ చేయబోతోందని తెలుస్తోంది.
ఈ షెడ్యూల్డ్ లో హై యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని తెలుస్తోంది. జులాయి, S/O సత్యమూర్తి వంటి చిత్రాలలో ఉపయోగించిన BHEL షూటింగ్ లోకేషన్ త్రివిక్రమ్‌కు ఫేవరేట్ స్పాట్ అని తెలిసిందే. ఇక ఈ షూటింగ్ ఎలాంటి ఘాటు ఎనర్జీని ఇస్తుందో చూడాలి అంటూన్నారు ఫ్యాన్స్. త్రివిక్రమ్ విజన్, మహేష్ బాబు పవర్-ప్యాక్డ్ ఎంటర్‌టైన్ కలయికపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న సినిమా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఆగస్టులో మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా మరో టీజర్‌ను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.
అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్నమూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక హీరోయిన్‌గా పూజాహెగ్డే ప్లేస్‌లో మీనాక్షి చౌదరిని తీసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై నిర్మాతల నుండి క్లారిటీ రావాల్సి ఉంది.