టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ టైటిల్ అప్డేట్ వచ్చేస్తోంది. మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న అప్డేట్ ఈ నెలాఖరున వచ్చే అవకాశం ఉంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం మహేష్ ఫ్యాన్స్ వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. అంతేకాదు.. మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.
కొద్దిరోజుల క్రితమే అఫీషియల్గా మొదలైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శెరవేగంగా జరుగుతోంది. పూజ హెగ్డే, శ్రీలీల లీడ్ రోల్స్ చేస్తున్న ఈ మూవీ.. 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. తాజాగా ఈ సినిమా నుండి వినిపిస్తున్న క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాకి "అమరావతి కి అటు ఇటు" అనే టైటిల్ ని ఫిక్స్ చేయనున్నారట మేకర్స్. ఈ నెలాఖరున ఇదే టైటిల్ తో మహేష్ కొత్త పోస్టర్ ని కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.
మే 31 సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్బంగా ఈ పోస్టర్ ని రిలీజ్ చేయనున్నారని సమాచారం. టైటిల్ కూడా త్రివిక్రమ్ స్టైల్లో ఆ అక్షరంతో మొదలవడం, క్యాచీగా ఉండటంతో.. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. హారిక హాసిని క్రియేషన్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి.. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.