పెద్ద మనసు చాటుకున్న మహేష్ బాబు కూతురు.. ఛారిటీకి విరాళంగా మొదటి జీతం

పెద్ద మనసు చాటుకున్న మహేష్ బాబు కూతురు..  ఛారిటీకి విరాళంగా మొదటి జీతం

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతల కుమార్తె సితార ఘట్టమనేని మరోసారి వార్తల్లో కెక్కింది. తన మొదటి వేతనాన్ని కమర్షియల్‌ నుంచి స్వచ్ఛంద సంస్థకు అందజేసింది. ఇటీవలే నగల బ్రాండ్ కోసం 'ప్రిన్సెస్' అనే షార్ట్ ఫిల్మ్ ప్రివ్యూతో పాటు, సితార తన తల్లి నమ్రత ఘట్టమనేనితో కలిసి హైదరాబాద్‌లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో తన పేరుతో ఉన్న కలెక్షన్ కోసం లుక్ బుక్‌ను కూడా లాంచ్ చేసింది. ఈ సందర్భంగా తనకు సినిమాలు చూడడమంటే ఇష్టమని, అందులో నటించేందుకు చాలా ఆసక్తి ఉందని చెప్పింది.

న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో ప్రారంభించిన సిగ్నేచర్ జ్యువెలరీ కలెక్షన్‌ను చూసి తన తండ్రి చాలా సంతోషించాడని, అడ్వర్టైజింగ్ వీడియో చూసి భావోద్వేగానికి గురయ్యానని సితార తెలిపింది. ఇదే సమయంలో, తమ కుమారుడు గౌతమ్ సినిమాల్లోకి రావచ్చని, అయితే ప్రస్తుతం తన ఉన్నత చదువుల్లో నిమగ్నమై ఉన్నాడని పేర్కొంది.