మహేష్ కూతురు సితార రేర్ రికార్డ్.. ఏకంగా న్యూ యార్క్ టైమ్స్ స్క్వేర్లో

మహేష్ కూతురు సితార రేర్ రికార్డ్.. ఏకంగా న్యూ యార్క్ టైమ్స్ స్క్వేర్లో

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) కూతురు సితార(Sitara) రేర్ రికార్డ్ క్రియేట్ చేశారు. తాజాగా ఆమె న్యూ యార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది చూసిన మహేష్ అభిమానులు తండ్రికి తగ్గ కూతురు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. సితార ప్రస్తుతం ప్రముఖ బంగారు నగల తయారీ సంస్థ పిఎంజె జివెల్స్(Pmj jewellers) కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఈ సంస్థ సితార కలెక్షన్ పేరుతో ప్రత్యేకంగా ఓ స్పెషల్ బ్రాండ్ ను క్రియేట్ చేశారు. దీనికి సంబంధించిన యాడ్ ను న్యూ యార్క్ సిటీలోని టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించడం ఇప్పుడు ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక సితార విషయానికి వస్తే.. ఇప్పటికే ఆమె తన డాన్స్ వీడియోస్ తో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. తండ్రి మహేష్ బాబుతో కలిసి పలు టీవీ షోలకు కూడా అటెండ్ అయ్యారు. ఇక రీసెంట్ గా జరిగిన నిర్మాత దిల్ రాజు(Dil raju) కుమారుడి పుట్టినరోజు ఈవెంట్ లో కనిపించి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు సితార. ఇవన్నీ చూస్తుంటే.. త్వరలో ఆమె వెండితెర ఎంట్రీ కూడా ఇవ్వనున్నారా అనే సందేహం కలగక మానదు