
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పూజా హెగ్దే జంటగా వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఉగాది సందర్భంగా చిత్ర బృందం శనివారం ఉదయం 9.09 గంటలకు చిత్ర టీజర్‌ను విడుదల చేసింది. ‘ సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్.. సక్సెస్ ఈజ్ ఏ జర్నీ’ అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ టీజర్ లో ఆకట్టుకుంది. ఇందులో మహేష్‌బాబు చాలా స్టైలిష్‌గా కనిపించారు. మహేశ్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.
వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే నెల 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.