నాగేశ్వరరావుకు సంబంధించిన అన్ని వివరాలను సేకరిస్తున్నాం

నాగేశ్వరరావుకు సంబంధించిన అన్ని వివరాలను సేకరిస్తున్నాం

మాజీ ఇన్ స్పెక్టర్ నాగేశ్వరరావు కేసును దర్యాప్తు చేస్తున్నామని రాచకొండ కమిషనర్‌ మహేష్ భగవత్ తెలిపారు. నాగేశ్వరరావుకు సంబంధించిన అన్ని వివరాలను సేకరిస్తున్నామని అన్నారు. అతనిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తామని చెప్పారు. నాగేశ్వరరావు బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు రావాలని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, వారికి రక్షణ కల్పిస్తామని తెలిపారు. నాగేశ్వరరావును కాపాడేందుకు ఒత్తిడి చేస్తున్నారన్నది అవాస్తమని మహేష్ భగవత్ స్పష్టం చేశారు.  ఈ నెల 7వ తేదీన నాగేశ్వర రావు తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో నాగేశ్వరరావును ఈ నెల 11న అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.