కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ధర్నాలు చేయడం దారుణం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ధర్నాలు చేయడం దారుణం

ధాన్యం కొనుగోలు చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధర్నా లు చేయడం సిగ్గు చేటన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామంటున్న ప్రభుత్వాలు..అసలు కొంటారా లేదా.. చెప్పాలని డిమాండ్ చేశారు. 20 రోజులుగా కల్లాలపై రైతులు పడుకుంటే.. పట్టించుకునే వారే లేరన్నారు. అసెంబ్లీ లో నల్ల చట్టాలపై తీర్మానాలు చేయాలన్నారు. పంట దిగిమతి ఎక్కువ వచ్చే అవకాశాలున్నాయన్న మహేష్..యూపీ రాజకీయాలపై ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ కు .. రైతుల గోస పట్టదా అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలుపై ఢిల్లీపై దండయాత్ర చెద్దామన్నారు.

కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమం కోసం పోరాటం చేస్తోందన్నారు  మహేష్ కుమార్ గౌడ్. ఇందులో భాగంగా రేపు(గురువారం) 10 గంటలకు పబ్లిక్ గార్డెన్ నుండి అగ్రికల్చర్ కమీషనరేట్ వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. పాదయాత్రలో రైతులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.