నిర్మల్ లో 4న జిల్లా కోర్టు భవనాలకు శంకుస్థాపన

నిర్మల్ లో  4న జిల్లా కోర్టు భవనాలకు శంకుస్థాపన
  •     హాజరుకానున్న హైకోర్టు జడ్జీలు

నిర్మల్, వెలుగు: నిర్మల్ లో నిర్మించనున్న కోర్టు భవనాల కాంప్లెక్స్​కు ఈనెల 4న శంకుస్థాపన చేయనున్నట్లు జిల్లా జడ్జి శ్రీవాణి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమానికి హైకోర్టు జడ్జిలు సుజన, కె.లక్ష్మణ్, నందికొండ నర్సింగ్ రావు హాజరుకానున్నట్లు చెప్పారు. జిల్లా ప్రధాన కోర్టుతోపాటు పోక్సో, ఫ్యామిలీ కోర్టు భవనాల నిర్మాణానికి కూడా వారు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు.