గ్రామాభివృద్ధిలో సర్పంచులదే కీలక పాత్ర : ఎమ్మెల్యే వేముల వీరేశం

గ్రామాభివృద్ధిలో సర్పంచులదే కీలక పాత్ర : ఎమ్మెల్యే వేముల వీరేశం
  • ఎమ్మెల్యే వేముల వీరేశం 

నార్కట్​పల్లి, వెలుగు: గ్రామ అభివృద్ధిలో సర్పంచులదే కీలక పాత్ర అని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం నార్కట్​పల్లి మండలంలోని  జువ్విగూడెం  గ్రామంలో సర్పంచ్ చింత అనిల్​ కుమార్​ ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాలను అభివృద్ధి చేసుకుందామన్నారు. 

కార్యక్రమంలో ఎంపీఓ  సుధాకర్, మండల పార్టీ అధ్యక్షుడు బత్తుల ఉషయ్య గౌడ్, సర్పంచులు జేరిపోతుల భరత్, ఎల్లందుల లింగస్వామి, నేతగాని కృష్ణయ్య, మాజీ సర్పంచ్ బిగి కొండయ్య, సట్టు సత్తయ్య, చింత శరత్​, జాన్ రెడ్డి, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.