ఆదిలాబాద్ జిల్లాలో పోగొట్టుకున్న 200 ఫోన్లు దొరికినయ్

ఆదిలాబాద్ జిల్లాలో పోగొట్టుకున్న  200 ఫోన్లు దొరికినయ్

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ ​జిల్లాలో జనం పోగొట్టుకున్న రూ.39 లక్షల విలువ చేసే 200 సెల్ ఫోన్లను గురువారం ఎస్పీ అఖిల్ మహాజన్ బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫోన్లు పోగొట్టుకుంటే బాధితులు వెంటనే https://www.ceir.gov.in వెబ్​సైట్​లో లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్​ను సంప్రదించాలని సూచించారు. 

పోగొట్టుకున్న ఫోన్ల కోసం రికవరీ బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో అడ్మిన్ ఏఎస్పీ పి.మౌనిక, ట్రైనీ ఎస్పీ రాహుల్ కాంత్, అదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, ప్రత్యేక బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.