జైనూర్, వెలుగు: జైనూర్ మండలం మార్లవాయిలో ఈ నెల 11న ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్-–బెట్టి ఎలిజబెత్ దంపతుల వర్ధంతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జైనూర్ ఏఎంసీ చైర్మన్ విశ్వనాథ్ పిలుపునిచ్చారు. గురువారం జైనూర్ మార్కెట్ యార్డులో వర్ధంతి వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి సక్సెస్ చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ కనక యాదవ్ రావు, జైనూర్ సర్పంచ్‌తో పాటు మార్లవాయి, దుబ్బగూడ, భూర్నూర్, పవర్‌గూడ, రాఘపూర్ గ్రామాల ప్రతినిధులు కనక ప్రతిభ, కౌసల్య, గణపత్‌రావు, రాజేందర్, లక్ష్మి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముఖీద్, పలువురు నాయకులు పాల్గొన్నారు.
