మంచిర్యాల, వెలుగు: మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి జయంతి సందర్భంగా మంచిర్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్న మెంట్ గురువారంతో ముగిసింది. ఛత్రపతి శివాజీ జట్టు టోర్నీ విజేతగా నిలిచింది. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ మాట్లాడుతూ.. క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 8 ఏండ్లుగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నానని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.
జిల్లాలోని యువతలో ఎంతో క్రీడా నైపుణ్యం ఉందని, వారిని ప్రోత్సహించడానికి ప్రతి ఏటా క్రికెట్, కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. విజేతగా నిలిచిన జట్టుకు ట్రోఫీ, రూ.15 వేలు, రన్నర్ జట్టుకు రూ.10 వేల ఫ్రైజ్ మనీ అందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో గాజుల ముఖేశ్ గౌడ్, పెద్దపల్లి పురుషోత్తం, వెరబెల్లి రవీందర్ రావు, బియ్యాల సతీశ్ రావు, జోగుల శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.
