
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీనే కాదు ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తం ఈగర్ వెయిట్ చేస్తున్న ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది రాజమౌళి(Rajamouli) అండ్ మహేష్(Mahesh babu) మూవీనే. ఈ ప్రాజెక్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుండే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. యాక్షన్ అండ్ అడ్వెంచరస్ గా రానున్నఈ ప్రాజెక్టు గురించి చిన్న అప్డేట్ వచ్చిన క్షణాల్లో నేషనల్ ట్రేడ్ ఆవుతోంది. అంతలా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు సినీ లవర్స్.
అయితే తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ సినిమాలో మహేష్ నెవర్ బిఫోర్ అవతార్ లో కనిపించనున్నాడట. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ లుక్ కోసం రాజమౌళి చాలా కేర్ తీసుకుంటున్నారట. అందులో భాగంగానే ఇంతకు ముందెన్నడూ కనిపించని సరికొత్త గెటప్ లో మహేష్ ను ప్రజెంట్ చేయాలని ఫిక్స్ అయ్యాడట జక్కన్న. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి ఆగస్టులోనే రానుందట. దీంతో మహేష్, రాజమౌళి ప్రాజెక్టు ఇప్పుడు నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది. ఇక ఈ న్యూస్ తెలుసుకున్న మహేష్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఎక్కించు జక్కన్నా.. ఇంకా హైప్ ఎక్కించు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.