నేను పార్టీ మారట్లేదు..కాంగ్రెస్ లోనే ఉంటా : మహేశ్వర్ రెడ్డి

నేను పార్టీ మారట్లేదు..కాంగ్రెస్ లోనే ఉంటా : మహేశ్వర్ రెడ్డి

తాను పార్టీ మారడం లేదని..కాంగ్రెస్ లోనే ఉంటానని ఆ పార్టీ నేత మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. తనను పార్టీ నుంచి పంపించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తాను పదవుల కోసం పని చేయలేదని.. సామాన్య కార్యకర్తలా పని చేశానన్నారు. ఇటీవల 10 మందికి నోటీసులు ఇచ్చారనేది అవాస్తవమన్నారు. బీజేపీ నాయకులైన ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కలిసిన తమ పార్టీ వారికి ఇంత వరకు షోకాజ్ నోటీసులు ఇవ్వలేదన్నారు. 

మర్రి శశిధర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదని మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆయనకు ఏఐసీసీ షోకాజ్ నోటీసులు ఇవ్వాలి గానీ.. రాష్ట్ర కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇవ్వడానికి వీల్లేదన్నారు. కాంగ్రెస్ ను పూర్తిగా కాంపిటేషన్ లో  లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇదంతా టీఆర్ఎస్, బీజేపీ ఆడుతున్న నాటకమని అన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని కోరారు. పార్టీలో ఒకరిమీద ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడం కరెక్ట్ కాదన్నారు. కాంగ్రెస్ లో అందరూ సమానులేనని, అందరికీ అవకాశాలు ఇవ్వాలన్నారు.