
హైదరాబాద్, వెలుగు: గోషామహల్ నియోజకవకర్గ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ భవన్లో మంగళవారం నిరసన తెలిపారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పై తప్పుడు ఆరోపణలు చేసిన మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సునీతా రావు హఠావో.. కాంగ్రెస్ బచావో అంటూ ఫ్ల కార్డులు ప్రదర్శించారు. పార్టీ లైన్ దాటి వ్యవహరించిన సునీతా రావుపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్‌కు, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్ కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.