Mahindra Thar Roxxపై తొలిసారిగా రూ.50వేలు తగ్గింపు.. స్పెషల్ డిస్కౌంట్ వివరాలు ఇవే..

Mahindra Thar Roxxపై తొలిసారిగా రూ.50వేలు తగ్గింపు.. స్పెషల్ డిస్కౌంట్ వివరాలు ఇవే..

మహీంద్రా & మహీంద్రా మరోసారి SUV కార్ల మార్కెట్‌లో దుమ్మురేపుతోంది. తమ కొత్త ఐకాన్‌ మోడల్ మహీంద్రా థార్ రాక్స్(Mahindra Thar Roxx) దేశ వ్యాప్తంగా అద్భుతమైన అమ్మకాలతో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ.. సంస్థ తాజాగా ప్రత్యేక పండుగ ఆఫర్లను ప్రకటించింది. కొనుగోలుదారులకు మొత్తంగా రూ.50వేలు విలువైన డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ప్యాకేజ్‌లో రూ.35వేలు క్యాష్ డిస్కౌంట్‌ తో పాటు రూ.15వేలు విలువైన యాక్సెసరీలు కూడా అందిస్తోంది. దీంతో థార్ రాక్స్ ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన కొనుగోలు ఆప్షన్ అయిపోయింది ఆటో లవర్స్‌కి.

థార్ రాక్స్ ఇంజిన్ విషయంలో కూడా అనేక ఆప్షన్స్ అందిస్తోంది. ఇందులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్‌ ఆప్షన్లు ఉన్నాయి. వీటికి మాన్యువల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ రెండు వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్‌ వెర్షన్‌ RWD (రియర్ వీల్ డ్రైవ్) సిస్టమ్‌తో వస్తే, డీజిల్‌ వెర్షన్‌ 4x4 ఆప్షన్‌ కూడా అందిస్తోంది. వీటి ప్రారంభ ధర రూ.12లక్షల99 వేల నుంచి రూ.23లక్షల 09 వేల వరకు ఎక్స్-షోరూమ్‌ రేట్లకు అందుబాటులో ఉన్నాయి.

ఆకర్షణలో కీలకంగా నిలుస్తున్నది థార్ రాక్స్ లోని ఇంటీరియర్‌ డిజైన్‌. SUVలో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌. 9 స్పీకర్ హార్మన్ కార్డన్ సౌండ్‌ సిస్టమ్‌ శ్రోతలకు ప్రీమియం ఆడియో అనుభవాన్ని ఇస్తుంది. ప్యానోరామిక్‌ సన్‌రూఫ్‌, వెయర్‌లెస్‌ ఛార్జింగ్‌, వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు, ఆటో క్లైమేట్‌ కంట్రోల్‌, కూలింగ్ గ్లోవ్‌బాక్స్‌ వంటి లగ్జరీ ఫీచర్లు డ్రైవింగ్‌ని మరింత సౌకర్యవంతంగా మార్చుతున్నాయి.

భద్రత విషయంలో కూడా థార్ రాక్స్ ముందంజలోనే ఉంది. ఈ SUVలో 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీల కెమెరా, కారులోని అన్ని చక్రాలకూ డిస్క్‌ బ్రేకులు, ఆటోహోల్డ్‌తో ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌ వంటి సిస్టమ్స్ ఉన్నాయి. అదనంగా లేన్‌ కీపింగ్‌ అసిస్ట్‌, అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌ వంటి అత్యాధునిక ADAS ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీంతో థార్ రాక్స్ ఇప్పుడు దేశీయ SUV మార్కెట్లో కొత్త బెంచ్‌మార్క్‌గా నిలుస్తోంది. ఆధునిక టెక్నాలజీ, ఆకర్షణీయమైన ఆఫర్ల కలయికతో థార్ రాక్స్ ప్రస్తుతం SUV ప్రీమియం సెగ్మెంట్‌లో అదిరిపోయే ఇమేజ్‌ సొంతం చేసుకుంటోంది.