
న్యూఢిల్లీ: ప్రస్తుత కరోనా టైమ్‌లో కస్టమర్లకు అండగా ఉండేందుకు ‘ఎం–ప్రొటెక్ట్ కోవిడ్’ ప్లాన్‌ను మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం & ఎం) ప్రకటించింది. మే–2021లో ట్రాక్టర్లను కొనుగోలు చేసిన వారికి రూ. లక్ష కవరేజి ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్‌ను ప్రొవైడ్ చేస్తోంది. మెడిక్లయిమ్ పాలసీ ద్వారా ఈ ఇన్సూరెన్స్ అందిస్తోంది. దీంతో పేషెంట్‌కు హోమ్ క్వారంటైన్ బెనిఫిట్స్ అందుతాయి. అంతేకాకుండా ప్రీ–అప్రూవ్డ్ లోన్లను ఇస్తామని ప్రకటించింది. ఈ కొత్త పాలసీతో కంపెనీ కస్టమర్లను, వారి కుటుంబాలను కరోనా నుంచి కాపాడతామని ఎం అండ్ ఎం ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.