రాష్ట్రాన్ని ‘డ్రగ్స్ ఫ్రీ స్టేట్’గా మారుస్తం

రాష్ట్రాన్ని ‘డ్రగ్స్ ఫ్రీ స్టేట్’గా మారుస్తం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం ప్రచారం చేస్తూ.. జనాలకు అవేర్ నెస్ కల్పించాలని పోలీసు అధికారులకు సూచించారు. శనివారం బోరబండలోని జయశంకర్ కమ్యూనిటీ హాల్ లో సిటీ పోలీసులు ‘డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్’ పేరుతో అవేర్ నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు. సిటీ సీపీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హోం మంత్రి మహమూద్ అలీ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ హాజరయ్యారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ రాహుల్ సిప్లిగంజ్ సాంగ్స్ పాడగా.. స్టూడెంట్లు ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం సీపీ ఆనంద్ మాట్లాడుతూ..   గంజాయి,కొకైన్,హెరాయిన్‌‌‌‌‌‌‌‌ లాంటి డ్రగ్స్‌‌‌‌‌‌‌‌కి స్టూడెంట్స్ బానిసలవుతున్నారని చెప్పారు. సిటీలోని1,400 బస్తీల్లో డ్రగ్స్,గంజాయిపై అవగాహన నిర్వహిస్తామన్నారు. క్లబ్ లు, పబ్ ల్లో కూడా తనిఖీ చేస్తామన్నారు. అనుమానాస్పదంగా ప్రవర్తించే పిల్లల కదలికలను పేరెంట్స్‌‌‌‌‌‌‌‌ గమనించాలన్నారు. వైజాగ్,ఏటూరు నాగారం,నర్సిపట్నం,ఒడిశా ఏజెన్సీల నుంచి సిటీకి గంజాయి ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ అవుతోందన్నారు.     డ్రగ్స్ అఫెండర్స్‌‌‌‌‌‌‌‌, కస్టమర్లకు శిక్షలు పడేలా చేస్తామన్నారు. డ్రగ్స్ ను అరికట్టేందుకు జనాలకు అవేర్ నెస్ కోసం లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ రూపొందించిన సాంగ్ సీడీని రిలీజ్ చేశారు.  

బోరబండలో ఔట్​పోస్టు పీఎస్ ప్రారంభం
బోరబండ డివిజన్​లో  తొందరలోనే పూర్తి స్థాయి పోలీస్ స్టేషన్​ను ప్రారంభిస్తామని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఎమ్మెల్యే గోపినాథ్, సీపీ ఆనంద్​తో కలిసి బోరబండ డివిజన్​లో ఏర్పాటు చేసిన ఔట్ పోస్టు పోలీస్ స్టేషన్ ను ఆయన ప్రారంభించారు.  అడిషనల్ కమిషనర్ చౌహన్ సహా పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ డివిజన్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్  తదితరులు పాల్గొన్నారు.