- వికారాబాద్ జిల్లా ఇంటర్ నోడల్ అధికారి శంకర్ నాయక్
వికారాబాద్, వెలుగు : ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి ఎన్.శంకర్ స్పష్టంచేశారు. వికారాబాద్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మంగళవారం చీఫ్ సూపరింటెండెంట్స్, అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు, కస్టోడియన్లు, ఫ్లైయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ మెంబర్లకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని, ప్రతి సెంటర్ లో తగిన వసతులు కల్పించాలని సూచించారు.
ఈనెల 24 నుండి జూన్ 3వ తేదీ వరకు పరీక్షలు ఉదయం, సాయంత్రం వేళల్లో ఉంటాయని తెలిపారు. వికారాబాద్ లో 5, తాండూరులో 4, పరిగిలో 4 సెంటర్లు, నవాబ్ పేట్, పెద్దేముల్, మర్పల్లి, మోమిన్ పేట్, దోమ, కొడంగల్, కుల్కచర్లలో ఒక్కో సెంటర్ చొప్పున మొత్తం 20 ఏర్పాటు చేసినట్లు వివరించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి వేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. డీఈసీ సభ్యులు రాజమోహన్ రావు, బుచ్చయ్య, ప్రిన్సిపాల్స్ నర్సింహ్మరెడ్డి, చెన్నయ్య, సురేశ్వర స్వామి, పలు కాలేజీల ప్రిన్సిపాల్స్, జూనియర్ లెక్చరర్లు పాల్గొన్నారు.
