రూ.వెయ్యి కోట్ల విలువైన మక్క, సోయా కొన్నం : డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి

రూ.వెయ్యి కోట్ల విలువైన మక్క, సోయా కొన్నం : డైరెక్టర్  శ్రీనివాస్ రెడ్డి
  • మార్క్​ఫెడ్ ​ఎండీ శ్రీనివాస్​ రెడ్డి వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మొక్కజొన్న, సోయాబీన్ పంటల కొనుగోళ్లు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా సాగుతున్నట్లు మార్క్‌‌‌‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్  శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 75,620 మంది రైతుల నుంచి 3,56,061 టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేశామని, దీని విలువ రూ.850 కోట్లకు పైగా ఉందని చెప్పారు. 

ఇందులో రూ.800 కోట్ల మేర రైతులకు చెల్లింపులు పూర్తయ్యాయని వివరించారు. సోయాబీన్ విషయంలో కేంద్రం 72,675 టన్నుల కొనుగోలుకు అనుమతి ఇవ్వగా, ఇప్పటివరకు 19,973 రైతుల నుంచి 41,265 టన్నుల  సోయాబీన్‌‌‌‌ను కొనుగోలు చేశామని తెలిపారు.