
రెండు చినుకులు పడినా.. వాతావరణం కాస్త చల్ల బడినా చాలు.. వేడివేడి మొక్కజొన్న పొత్తులు తినాలనిపిస్తుంది. ఈ మొక్కజొన్న రుచితో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఇందులోని పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఇవి తింటే రాళ్లను పిండి చేసే బలం వస్తుందని చెబుతుంటారు.
- మొక్కజొన్నలో ఉండే పీచు జీర్ణాశయపనితీరుని మెరుగుపరుస్తుంది.అజీర్తిని తగ్గించి మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. ఎక్కువ బరువుని కూడా కంట్రోల్ చేస్తుంది.
- మొక్కజొన్నలో ఉండేకెరొటినాయిడ్లు, బయోఫ్లేవనాయిడ్లు రక్తంలోని చెడుకొలెస్ట్రాల్ను అదుపులో
- ఉంచుతాయి. కండరాలనుదృఢంగా ఉంచుతాయి.
- మొక్కజొన్నలోని విటమిన్-బి12, ఇనుము, ఫోలిక్ యాసిడ్ రక్తహీనతకు చెక్ పెడతాయి. అలాగే ఇందులోని బిటాకెరొటిన్ శరీరంలోకి చేరాక విటమిన్-ఏగా మారుతుంది. ఇది కంటిచూపుని మెరుగుపరుస్తుంది.
- మొక్కజొన్నలోని పిండి పదార్థాలు శరీరానికి శక్తినిచ్చి చురుగ్గా ఉండేలా చేస్తాయి.
- మొక్కజొన్న నుంచి లభించే ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లు గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి.
- గర్భిణులకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ కూడా మొక్కజొన్నల నుంచి అందుతుంది.