
స్టీమ్ బాత్ అంటే ఆవిరితో స్నానం.. దీనివలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు బ్యూటీగా.. యూత్ ఫుల్ గా ఉంటారు. ఇంకా స్టీమ్ బాత్ వలన ఎలాంటి ఉపయోగాలున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !
స్టీమ్ బాత్ చేస్తే..అందంగా ఉండాలి. దాంతోపాటు ఆరోగ్యం కావాలనుకుంటున్నారా? అయితే మీరు ఎంచక్కా స్టీమ్ చేయొచ్చు. స్టీమ్ బాత్ వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయనే విషయం చాలామందికి తెలియదు. స్టీమ్ బాత్ వల్ల శరీరం రిలాక్స్ కావటంతో పాటు యూత్ ఫుల్ నెస్ ఫీలింగ్ కలుగుతుంది. దీంతో పాటు సైనస్ శుభ్రంగా ఉంటుంది.
- స్టీమ్ థెరఫీ గ్రీకుల కాలం నుంచే ఉంది. ఆరోగ్యమైన శరీరం కోసం గ్రీకులు స్టీమ్ బాత్ ను ఆశ్రయించేవారట. మనదేశంలో ఆవిరిపట్టుకోవడం అనే ప్రక్రియ చాలా సహజమైనది.
- ఆవిరిపట్టుకోవడం వల్ల 'అందమైన ఆరోగ్యం' సొంతమవుతుంది. ఒత్తిడి, డిప్రెషన్ వదులుతుంది.
- ఆవిరిపట్టుకోవడం వల్ల శరీరం రిలాక్సేషన్ స్థితికి వస్తుంది. దీంతో పాటు సుఖనిద్ర కలుగుతుంది.
- ఇమ్యూన్ సిస్టమ్ స్టీమ్ బాత్ వల్ల బలపడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది.
- జలుబు, దగ్గు, అలర్జీ సమస్యలు స్టీమ్ బాత్ వదిలిపోతాయి.
- శరీరానికి హాని కలిగించే టాక్సిన్స్ బయటకు పోతాయి.
- చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. చర్మంపై నొప్పితో కూడిన వాపు త్వరగా తగ్గిపోతుంది.
- స్టీమ్ బాత్ వల్ల బరువు తగ్గుతారని పరిశోధకులంటున్నారు.