ఘోర రోడ్డు ప్రమాదం..కంటైనర్ కిందికి దూసుకెళ్లిన కారు.. భార్యభర్తలు స్పాట్ డెడ్

ఘోర రోడ్డు ప్రమాదం..కంటైనర్ కిందికి దూసుకెళ్లిన కారు.. భార్యభర్తలు స్పాట్ డెడ్

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు భార్యభర్తలు ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే నవీన్ రాజు,భార్గవి దంపతులు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు కారులో వేళ్తుండగా సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా కంటైనర్ కిందికి కారు దూసుకపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు స్పాట్ లోనే మృతి చెందారు. 

స్థానికులు ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీలను రికవరీ చేశారు.  మృతులు నవీన్ రాజు, భార్గవిలుగా గుర్తించారు. నవీన్ రాజు విజయవాడలోని శ్రీ చైతన్య కళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నట్టు తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృత దేహాలను కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు.   అతివేగం, నిద్ర మత్తు వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రథమికంగా అంచనా వేశారు.