ఘోర ప్రమాదం.. పాల ప్యాకెట్ కోసం వెళ్తుండగా యాక్సిడెంట్.. స్పాట్ లోనే

ఘోర ప్రమాదం.. పాల ప్యాకెట్ కోసం వెళ్తుండగా యాక్సిడెంట్.. స్పాట్ లోనే

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలో జరిగిన ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే అబ్దుల్లాపూర్ మెట్టు మండలం ఇనాంగూడకి చెందిన శెట్టి కనక ప్రసాద్ అనే వ్యక్తి తన రెండేళ్ల బాబుతో ఉదయం పాల ప్యాకెట్ కోసం బైక్ పై బయటకు వెళ్లాడు. ఈ సమయంలో విజయవాడ జాతీయ రహదారిపై డీసీఎం ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న కనక ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు.

 దిక్కు తోచని స్థితిలో తండ్రి మృతదేహం దగ్గరే కూర్చుని బాబు ఏడుస్తున్న ఘటన అక్కడున్న వారిని కలిచివేసింది. బాబు ముఖంపై గాయాలు కావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. యాక్సిడెంట్ పై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.