భారీ అగ్నిప్రమాదం.. సబ్ స్టేషన్ లో ఎగిసి పడుతున్న మంటలు..

 భారీ అగ్నిప్రమాదం.. సబ్ స్టేషన్ లో ఎగిసి పడుతున్న మంటలు..

సిద్దిపేట జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సిద్దిపేట పట్టణంలోని 130 కేవీ సబ్ స్టేషన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు పెరిగి సబ్ స్టేషన్ మొత్తానికి అంటుకున్నాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ పోలీసులు మంటలను ఆర్పేందకు ప్రయత్నిస్తున్నారు. ఘటన పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు ఫోన్ లో మాట్లాడారు. మంటలను ఆర్పడానికి గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నుంచి ఫైర్ ఇంజన్లు తీసుకెళ్లాలని భట్టి అధికారులను ఆదేశించారు.