
తమిళనాడు: చెన్నై.. మీనంబాక్కంలోని ప్రముఖ షూటింగ్ లొకేషన్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అన్నీ చెక్కలు, అట్టలు, బట్టలతో చేసిన సెట్టింగులే ఉండటంతో… క్షణాల్లోనే మంటలు విస్తరించాయి. 50 సెట్టింగ్స్ అగ్నికి ఆహుతయ్యాయి.
మూతపడ్డ ఓ ప్రైవేట్ కంపెనీని.. సినిమా షూటింగులకు అద్దెకిస్తున్నారు ఇక్కడి నిర్వాహకులు. భారీ బడ్జెట్, లో- బడ్జెట్ .. రెండు రకాల సినిమాల షూటింగ్ కు ఇది మేజర్ అడ్డా. ప్రతిరోజూ ఈ లొకేషన్ .. షూటింగ్ లతో బిజీగా ఉంటుంది. ఐతే.. ఇవాళ మధ్యాహ్నం ఓ లోకేషన్ లో షార్ట్ సర్క్యూట్ కావడంతో.. నిప్పు రవ్వలు ఎగిరిపడ్డాయి. అక్కడి నుంచి మంటలు వేగంగా ఇతర లొకేషన్ సెట్టింగ్స్ కు విస్తరించాయి. భారీ ఫైర్ ఇంజిన్లను రప్పించి… మంటలు ఆర్పుతున్నారు. భారీస్థాయిలో ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది.