ఇద్దరు సీఎంల ఓటమి.. పశ్చిమ బెంగాల్‌‌లో మమత, తమిళనాడులో స్టాలిన్

ఇద్దరు సీఎంల ఓటమి.. పశ్చిమ బెంగాల్‌‌లో మమత, తమిళనాడులో స్టాలిన్

అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు సీఎంలు ఓటమిపాలయ్యారు. కోల్‌‌కతా జిల్లా భవానీపూర్‌‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ పరాజయం చెందారు.   

భవానీపూర్ తన కంచుకోట అని, చివరికి ఒక్క ఓటుతోనైనా సరే గెలుస్తానని చెప్పుకున్నా.. ఏకంగా 15 వేల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు. అలాగే, తమిళనాడులో డీఎంకే కంచుకోటగా భావించే కొళత్తూర్ నియోజకవర్గంలో ఆ పార్టీ చీఫ్​, సీఎం ఎంకే స్టాలిన్‌‌ ఓటమిని చవిచూశారు. టీవీకే పార్టీ అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో 8,795 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.